ఇండియా(India)లో చాలా నగరాల్లోని రోడ్లు చిన్నపాటి వర్షానికే కాలువలను తలపిస్తాయి. ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు, రోడ్లపై వరద పారుతుంది. ఇళ్లలోకి వాన నీరు చేరుతుంది. ఇంటి బయట, రోడ్లపై పార్క్ చేసిన వాహనాల్లోకి నీరు చేరుతుంది. చెన్నై నగరంలో ప్రస్తుత పరిస్థితి ఇదే. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటిలో చాలా కార్లు చిక్కుకుపోయాయి. వరదలో కారు చిక్కుకుంటే ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వరదలో కారు చిక్కుకోవడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే మరింత నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కారు పర్ఫార్మెన్స్ దెబ్బతినకుండా ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకుందాం.
* కారు స్టార్ట్ చేయవద్దు
కారు వరదలో చిక్కుకున్నప్పుడు వెంటనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. ముందుగా కారును మాన్యువల్‌గా అన్‌లాక్ చేయాలి. నీటిని బయటకు పంపడానికి, వెంటిలేషన్ అందించడానికి అన్ని డోర్‌లు ఓపెన్ చేయాలి. కారులో ఎలక్ట్రికల్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. కారు పూర్తిగా ఆరనివ్వండి, అవసరమైతే త్వరగా ఆరబెట్టేందుకు పోర్టబుల్ ఫ్యాన్ ఉపయోగించవచ్చు.
* ఫ్యూయల్ ట్యాంక్‌ను ఖాళీ చేయండి
వర్షాలు, వరదల సమయంలో ఫ్యూయల్ ట్యాంక్‌లో నీరు చేరే అవకాశం ఉంటుంది. వాటర్ కంటామినేషన్ కాకుండా ఫ్యూయల్ ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేయాలి. ఫ్యూయల్‌తో కలిసిన నీరు సిలిండర్లు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు (లేదా పాత వాహనాలలో కార్బ్యురేటర్లు), ఇతర భాగాలలో సమస్యలను క్రియేట్ చేస్తుంది. అందుకే కారు ట్యాంక్ ఖాళీ చేసి, మళ్లీ కొత్తగా ఇంధనం నింపాలి.
ఒకే రైలు టికెట్ తో 56 రోజుల ప్రయాణం..
* ఫ్లూయిడ్స్ మార్చండి
కారులో వైరింగ్ సరిగా ఉంటే, అన్ని ఫ్లూయిడ్స్ మార్చాలి. ఇంజిన్ ఆయిల్, గేర్‌బాక్స్ ఆయిల్, డిఫరెన్షియల్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, క్లచ్ ఫ్లూయిడ్, కూలెంట్‌లను డ్రైన్ చేసి రీప్లేస్ చేయాలి. మురికి నీరు సిస్టమ్‌లోకి ప్రవేశించకపోయినా, ఈ ఫ్లూయిడ్స్‌ను రీప్లేస్ చేయడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరిగే అవకాశం ఉండదు. ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం కూడా మంచిది.
ఇది కూడా చదవండి: రోజుకు రూ.41 కడితే చాలు.. 100 ఏళ్ల వరకు ఆదాయం.. ఈ ప్లాన్ అదుర్స్!
* బ్యాటరీ టెర్మినల్స్ డిస్‌కనెక్ట్ చేయండి
కార్‌ను మ్యానువల్‌గా అన్‌లాక్ చేసిన తర్వాత కారు బానెట్‌ను ఓపెన్ చేయండి. బ్యాటరీ టెర్మినల్స్ డిస్‌కనెక్ట్ చేయండి. ఇలా చేయడంతో నీటి వల్ల సంభవించే పొటెన్షియల్ షార్ట్ సర్క్యూట్‌కు చెక్ పెట్టవచ్చు.
* ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు కాల్ చేయండి
కారు వరదల్లో చిక్కుకొని ఆగిపోతే.. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి, సహాయం తీసుకోండి. కొందరు స్వయంగా మెయింటెనెన్స్ హ్యాండిల్ చేయడానికి ఇష్టపడవచ్చు. కానీ నిపుణుల పనితనంతో కారును ఎలాంటి సమస్యలు లేకుండా ముందున్న కండిషన్‌కి తీసుకురావచ్చు.
-
Follow us on
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..